హత్రాస్ సామూహిక అత్యాచార ఘటనపై స్పందించిన కోహ్లీ

ABN , First Publish Date - 2020-09-30T01:28:14+05:30 IST

హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని మరోమారు కుదిపేస్తోంది. నలుగురు మృగాళ్ల చేతిలో పడి దారుణంగా అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీలోని

హత్రాస్ సామూహిక అత్యాచార ఘటనపై స్పందించిన కోహ్లీ

లక్నో: హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని మరోమారు కుదిపేస్తోంది. నలుగురు మృగాళ్ల చేతిలో పడి దారుణంగా అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నేడు (మంగళవారం) ప్రాణాలు విడిచింది. హత్రాస్ ఘటన దేశాన్ని మరోమారు షాక్‌కు గురిచేయడమే కాకుండా గతంలోని దారుణాలు మరోమారు గుర్తుకు తెచ్చింది. 



యువతిని దారుణంగా హింసించిన నిందితులు అత్యాచారం అనంతరం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుక కోసేయడం చూస్తుంటే వారెంత పైశాచికంగా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు. యువతి శరీరంపై అయిన గాయాలు 2012 నాటి నిర్భయ సామూహిక అత్యాచార ఘటనను తలపించాయి.  


ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. యవతిపై దారుణానికి పాల్పడిన నలుగురు దుర్మార్గులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. హత్రాస్ ఘటన అమానవీయమని, క్రూరత్వానికి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-09-30T01:28:14+05:30 IST