Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ వ్యాఖ్యలు ఇవీ..

కేప్‌టౌన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు మరో రోజు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో దారుణ ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టిస్తుందనుకున్న భారత జట్టు 1-2 తేడాతో ఓటమి పాలైంది. సెంచూరియన్ టెస్టులో విజయం సాధించిన భారత్ ఆ తర్వాత జొహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ టెస్టుల్లో వరుస పరాజయాలు చవిచూసింది. 


మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో తరచూ విఫలమవుతుండడం ఎంతమాత్రమూ మంచిది కాదని, ఆ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అన్నాడు. దీనిని తాము విశ్లేషించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.


మరే సమస్యా లేదని, ఒక్క బ్యాటింగ్ తీరే కలచి వేస్తోందని అన్నాడు. విదేశీ పర్యటనల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది ఇదేనని, దీనిని సరిచేసుకున్నప్పుడు తాము విజయం సాధించామని గుర్తు చేశాడు. సరిదిద్దుకోలేని చోట ఓటమి పాలయ్యామని కోహ్లీ వివరించాడు.

Advertisement
Advertisement