ప్రతిరోజూ అంతరిక్ష యాత్రలు..వర్జిన్ గాలెక్టిక్ లక్ష్యం ఇదే

ABN , First Publish Date - 2021-07-15T04:56:21+05:30 IST

తొలి యాత్ర విజయవంతమవడంతో మంచి హుషారు మీదున్న వర్జిన్ గాలెక్టిక్..ప్రతిరోజు అంతరీక్షయాత్రలను చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ప్రతిరోజూ అంతరిక్ష యాత్రలు..వర్జిన్ గాలెక్టిక్ లక్ష్యం ఇదే

వాషింగ్టన్: రిచర్డ్ బ్రాన్సన్ నేతృత్వంలోని వర్జిన్ గాలెక్టిక్ సంస్థ ఇటీవలే తన తొలి అంతరియాక్ష యాత్రను దిగ్వియంగా నిర్వహించింది. ఈ యాత్రలో సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటూ  మరో నలుగురు కీలక అధికారులు కూడా పాల్గొన్నారు. మరి కొద్ది రోజుల్లో జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ కూడా ఈ యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే..ఈ రెండు సంస్థల లక్ష్యాలు పూర్తిగా భిన్నం. సామాన్య పౌరులకు అంతరిక్ష విహార యాత్రను అందుబాటులోకి తేవాలని వర్జిన్ గాలెక్టిక్ ప్రయత్నిస్తుంటే బ్లూ ఆరిజిన్ మాత్రం ఈ యత్రలకుతో పాటూ రోదసిలో మానవుల నివాసం, ప్రభుత్వం కాంట్రాక్టులు వంటి లక్ష్యాలతో కూడి విస్తృత ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కాగా.. తొలి యాత్ర విజయవంతమవడంతో మంచి హుషారు మీదున్న వర్జిన్ గాలెక్టిక్..ప్రతిరోజు అంతరీక్షయాత్రలను చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 

Updated Date - 2021-07-15T04:56:21+05:30 IST