30న వర్చువల్‌ లోక్‌ అదాలత

ABN , First Publish Date - 2021-01-21T06:33:06+05:30 IST

జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 30న మండల న్యాయసేవా అధికారం సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్‌ లోక్‌అదాలత నిర్వహిస్తున్నామని సీనియర్‌ సివిల్‌జడ్జి పూర్ణిమ, జూనియర్‌ సివిల్‌జడ్జి జన్నతబేగం తెలిపారు.

30న వర్చువల్‌ లోక్‌ అదాలత

- విజయవంతం చేయండి: జడ్జి 

పెనుకొండ, జనవరి 20: జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 30న మండల న్యాయసేవా అధికారం సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్‌ లోక్‌అదాలత నిర్వహిస్తున్నామని సీనియర్‌ సివిల్‌జడ్జి పూర్ణిమ, జూనియర్‌ సివిల్‌జడ్జి జన్నతబేగం తెలిపారు. బుధవారం స్థానిక కోర్టు కార్యాలయంలో జన్నతబేగం ఆధ్వర్యంలో వర్చువల్‌ అదాలతపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసు పరిష్కరించుకోవాలనుకున్న కక్షిదారులు తమ ఆమోదంకోసం ఎస్‌ఎంఎస్‌ ద్వారాకాని, వాట్సా్‌ప ద్వారాకాని ఈనెల 28లోపు జిల్లా న్యాయసేవా సంస్థ అధికార సంస్థ అనంతపురానికి పంపవచ్చన్నారు.  9440901044కు ఎస్‌ఎంఎ్‌సకు పంపాలన్నారు. సమావేశంలో పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, గోరంట్ల, కియ స్టేషనకు సంబంధించిన ఎస్‌ఐలు, ఏపీపీ నగేష్‌, ఎక్సైజ్‌ ఎస్‌ఐ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T06:33:06+05:30 IST