ఉద్యోగుల కోసం 24/7 కొవిడ్-19 కేర్ పోర్టల్ ప్రవేశపెట్టిన వెర్ట్యూసా

ABN , First Publish Date - 2021-05-11T11:30:41+05:30 IST

కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఉద్యోగుల భద్రత కోసం డిజిటల్ వ్యూహాలు, డిజిటల్ ఇజనీరింగ్, ఐటి సేవలు, పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించే సంస్థ, వెర్ట్యూసా కార్పొరేషన్..

ఉద్యోగుల కోసం 24/7 కొవిడ్-19 కేర్ పోర్టల్ ప్రవేశపెట్టిన వెర్ట్యూసా

కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఉద్యోగుల భద్రత కోసం డిజిటల్ వ్యూహాలు, డిజిటల్ ఇజనీరింగ్, ఐటి సేవలు, పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించే సంస్థ, వెర్ట్యూసా కార్పొరేషన్.. వ్యక్తిగతమైన ఫీచర్లతో రూపొందించిన 24/7 కొవిడ్- 19 కేర్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. వెర్ట్యూసా కొవిడ్-19 చొరవలో ఒక విశిష్టమైన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్క టీమ్ సభ్యుడు, వారి కటుంబాల పట్ల దీనికి వ్యక్తిగతమైన దృక్పథం ఉంటుంది. ఏ ఒక్క విషయాన్నీ విడిచిపెట్టకుండా చూసుకుంటుంది. 24/7 ప్రత్యక్ష మద్దతు, సహాయంతో, లాగ్ అయిన అన్ని ప్రశ్నలనూ, వ్యాక్సినేషన్లకు సంబంధించి టీమ్ సభ్యుల డేటానూ పోర్టల్, కాల్ సెంటర్ పర్యవేక్షిస్తూ ఉంటాయి. 24/7 కొవిడ్-19 కేర్ పోర్టల్ కార్యక్రమాలకు సుందర్ నారాయణన్, వెర్ట్యూసా చీఫ్ పీపుల్ ఆఫీసర్ నాయకత్వం వహిస్తారు.

Updated Date - 2021-05-11T11:30:41+05:30 IST