ఎటుచూసినా కరోనా పేషంట్లే.. ఆసుపత్రిలా మారిన న్యూయార్క్

ABN , First Publish Date - 2020-04-08T22:46:30+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ నగరం ప్రస్తుతం ఆసుపత్రిలా కనపడుతోంది. ఎ

ఎటుచూసినా కరోనా పేషంట్లే.. ఆసుపత్రిలా మారిన న్యూయార్క్

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం ప్రస్తుతం ఆసుపత్రిలా కనపడుతోంది. ఎటు చూసినా పేషంట్లే కనపడుతున్నారు. ఒక ఆసుపత్రికి ఒకే సమయంలో గుండెపోటుతో ఆరుగురు వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో చోటు దొరికే లోపే వీరిలో నలుగురు దుర్మరణం చెందారు. న్యూయార్క్ ఇప్పుడు అమెరికా మొత్తానికి కరోనా క్యాపిటల్ అవుతుందని చెప్పడానికి ఇదో నిదర్శనం. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో పేషంట్లు రావడం, గంటల వ్యవధిలో వారు చనిపోవడం జరుగుతోంది. బ్రూక్లిన్ యూనివర్శిటీ హాస్పిటల్ ప్రస్తుతం శవాల దిబ్బగా మారింది. మార్చురీలలో శవాలను పెట్టేందుకు ఖాళీ లేక ఆసుపత్రి బయటే శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. రోడ్ల పక్కనే చిన్న టెంట్లు ఏర్పాటు చేసి వాటిపి మొబైల్ మార్చురీలగా మార్చుతున్నారు. అమెరికాలో నిత్యం దాదాపు 500 మంది వరకు ప్రాణాలు వదులుతున్నారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో చేరిన వారిలో 25 శాతం మంది చనిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు. ఒక ఆసుపత్రిలో చేరిన 400 మంది పేషంట్లలో 90 శాతం మంది 45 ఏళ్లకు పైబడిన వారే. 60 శాతం మంది 65ఏళ్లకు పైబడిన వారేనని వైద్యులు చెబుతున్నారు.


మరోపక్క 45 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు కూడా కరోనా బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క న్యూయార్క్‌లోనే అదనంగా 30 వేల వెంటిలేటర్ల అవసరం ఏర్పడింది. పేషంట్లు పెరిగిపోవడంతో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఆసుపత్రుల్లో ఏర్పడింది. మిలటరీ వైద్యులు కూడా ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సిన పరిస్థితి వచ్చింది. రానున్న రోజుల్లో న్యూయార్క్ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యేలా కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క తమకు కరోనా ఎక్కడ సోకుతుందేమోనని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తమ వల్ల కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడతారేమోనని భయపడుతున్నారు. ఈ కారణంగానే అనేక మంది డాక్టర్లు ఇళ్లలకు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది.

Updated Date - 2020-04-08T22:46:30+05:30 IST