శ్వాస ద్వారా వైరస్‌ వ్యాప్తి ప్రమాదం అధికం!

ABN , First Publish Date - 2021-05-10T10:39:10+05:30 IST

ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తి శ్వాస ద్వారా అధిక మోతాదులో వైరస్‌ కణాలు విడుదలవుతాయని, వీటి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశాలు అధికమని యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పేర్కొంది.

శ్వాస ద్వారా వైరస్‌ వ్యాప్తి ప్రమాదం అధికం!

వాషింగ్టన్: ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తి శ్వాస ద్వారా అధిక మోతాదులో వైరస్‌ కణాలు విడుదలవుతాయని, వీటి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశాలు అధికమని యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పేర్కొంది. ఈ వ్యాప్తి మూడు రకాలుగా జరుగుతుందని, శ్వాస ద్వారా నేరుగా వెళ్లడం ఓ రకమైతే.. నాసికం బాహ్యపొరలపై ఉన్న వైరస్‌.. చేతితో నలపడం ద్వారా లోనికి ప్రవేశించడం మరో రకమని తెలిపింది. అలాగే, చేతి వేళ్లకు అంటుకుని ఉన్న వైరస్‌.. ఆ వేళ్లతో నాసికా పొరలను తాకడం వ లోనికి ప్రవేశిస్తుందని వివరించింది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తికి ఎంత ఎక్కువ దూరంలో ఉంటే.. వైరస్‌ బారిన పడే ప్రమాదం అంత తగ్గుతుందని, ఆ దూరం ఆరు అడుగులకు మించి ఉండాలని యూఎస్‌ మెడికల్‌ బాడీ తాజా మార్గదర్శకాల్లో సూచించింది. 

Updated Date - 2021-05-10T10:39:10+05:30 IST