Abn logo
Jan 13 2021 @ 16:33PM

పాప గురించి మీడియాకు విరుష్క కొత్త డిమాండ్!

న్యూఢిల్లీ: ఇటీవలే తల్లిదండ్రులైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ జంట ఫొటోగ్రాఫర్లకు ఓ విజ్ఞాపన చేశారు. తమ పాపకు సంబంధించిన ఫొటోలు తీసుకోవద్దని వాళ్లిద్దరూ కోరారు. ‘మా ఇద్దరికి సంబంధించి మీకు కావలసిన సమాచారం మొత్తం మీకు దొరుకుతుంది. కానీ దయచేసి మా పాపకు సంబంధించిన వివరాలేవీ రాయొద్దు. ఈ వినతిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం’ అని మీడియాను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన చేశారు విరుష్క. ఈ జంటకు తాజాగా ఓ ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. అనుష్క డెలివరీ ఈ నెలలో ఉండటంతో ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను కూడా విరాట్ పక్కన పెట్టేశాడు. పేరెంటల్ లీవ్ తీసుకొని ఈ ముఖ్యమైన సమయంలో భార్యతో ఉన్నాడు.

Advertisement
Advertisement
Advertisement