Abn logo
Jun 23 2021 @ 04:06AM

కరాటే క్రీడాకారుడికి వీసా కష్టాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): యూఎస్‌ ఓపెన్‌ కరాటే చాంపియన్‌షి్‌పలో పాల్గొనే అవకాశం లభించిన ప్రముఖ కరాటే మాస్టర్‌ జమీల్‌ ఖాన్‌ను వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. వచ్చేనెల 1 నుంచి 3 వరకు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్న ఈ పోటీల్లో మాస్టర్స్‌ విభాగంలో జమీల్‌ పాల్గొనాలి. అయితే, కొవిడ్‌ నిబంధనల కారణంగా మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేందుకు ఆంక్షలు విధించడంతో జమీల్‌కు వీసా ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ఈనెల 28 లోపు తాను హైదరాబాద్‌ నుంచి అమెరికాకు బయలుదేరలేకపోతే ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోతానని జమీల్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం లేదా మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌లో ఎవరైనా చొరవ తీసుకొని తనకు వీసా లభించేలా కృషి చేయాలని జమీల్‌ విజ్ఞప్తి చేస్తున్నాడు.