క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు అనుమతించిన వీసా..

ABN , First Publish Date - 2021-03-29T23:58:03+05:30 IST

క్రిప్టోకరెన్సీలకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సంస్థ వీసా కీలక నిర్ణయం తీసుకుంది.

క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు అనుమతించిన వీసా..

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సంస్థ వీసా కీలక నిర్ణయం తీసుకుంది. ఇథీరియమ్ నెట్వర్క్ ద్వారా డిజిటల్ కరెన్సీ యూఎస్‌డీ కాయిన్‌లో చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. విసా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ డిజిటల్ కరెన్సీని సాధారణ నగదు రూపంలో మార్చే అవసరం తప్పనుంది. వీసాకు మునుపే ఇతర ప్రముఖ సంస్థలైన బీఎన్‌వై మెలన్, బ్లాక్‌రాక్, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు డిజిటల్ కరెన్సీ చెల్లింపులను అనుమతించాయి. దీంతో..పెట్టుబడులకు సంబంధించినంత వరకూ క్రిప్టోకరెన్సీలు కూడా ప్రధాన భాగం కానున్నాయనే అంచనాలు ఊపందుకున్నాయి. ఇప్పటవరకూ వీసా ద్వారా క్రిప్టోకరెన్సీల్లో చెల్లింపులు చేయాలనుకుంటే వీటిని ముందుగా సాధారణ నగదులోకి మార్చాల్సిన అవసరం ఉండేంది. అయితే..ఈథీరియమ్ టెక్నాలజీ ఆధారంగా చెల్లింపులు చేసేందుకు వీసా అనుమతించడంతో ఈ నగదు మార్పిడి అవసరం తప్పిపోయింది. 

Updated Date - 2021-03-29T23:58:03+05:30 IST