విశాఖ ఉక్కు తెలుగు ప్రజల ఆస్తి

ABN , First Publish Date - 2021-08-03T06:55:13+05:30 IST

తెలుగు ప్రజల ఆస్తి అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ కె.ఉమామహేశ్వరరా వు హెచ్చరించారు.

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల ఆస్తి

విజయవాడ సిటీ, ఆగస్టు 2 : తెలుగు ప్రజల ఆస్తి అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌  కె.ఉమామహేశ్వరరా వు హెచ్చరించారు. విశాఖ ఉద్యోగులు, బీజేపీయేతర పార్టీలు నిర్వహిస్తున్న ‘మార్చ్‌ టు పార్లమెంట్‌’ కు సంఘీభావంగా వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ధర్నా సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించి రాష్ట్రానికి ద్రో హం చేసిన బీజేపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో మరింతనష్టం చేయాలను కోవడం దుర్మార్గమన్నారు. వేదిక జిల్లా కన్వీనర్‌ ఎం.వి.సుఽధాకర్‌, సీఐటీయూ నేతలు ఎన్‌సీహెచ్‌ శ్రీనివాస్‌, ఎ.కమల, కె.దుర్గారావు, టి.ప్రభుదాస్‌, వై.సు బ్బారావు, టి.ప్రవీణ్‌, ఏఐటీయూసీ నేతలు ఎం.సాంబశివరావు, వి.నాగేశ్వర రావు, ఐ.ఎఫ్‌.టి.యూ, డీవైఎఫ్‌ఐ నాయకులు ప్రసాద్‌, నిజాం, ఆటో, హాకర్స్‌ పెన్సనర్స్‌, విద్యార్ధి నాయకులు హనుమంతరావు, సిహెచ్‌.మురళి, ఎం.ఎన్‌.పాత్రుడు, చంద్రశేఖర్‌, ఏ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:55:13+05:30 IST