Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ మన్యంలో కరోనా

విశాఖ: విశాఖ మన్యంలో గిరిజనులు మంచనా పడుతున్నారు. అయితే వారికి వచ్చింది కరోనా లేక  సీజనల్ జ్వరాల తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో పలు గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే,  ప్రతి గ్రామంలో ఇద్దరి నుండి పదిమంది వరకు  కరోనా కేసులు నమోదు కావడంతో  మారుమూల ప్రాంతాలకు కరోనా విస్తరించినట్లు స్పష్టమైంది. 


విశాఖ ఏజెన్సీలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. చాలా గ్రామాలకు రహదారులు లేవు. అయితే ఇతర గ్రామాల నుంచి ప్రజలు వచ్చే ఆవకాశం లేదు. గ్రామాల మధ్య రాకపోకలు లేనప్పుడు స్ధానికులకు కరోనా సోకడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి, అరకు మండలంలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీటితో పాటు కొయ్యూరు, జీకే  వీధి,  పాడేరు,  పెదబయలు,  చింతపల్లి, జీ మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగూడ గ్రామాల  ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement