అన్ని చోట్ల ఒకలా.. విశాఖలో మాత్రం ఇంకోలా..!

ABN , First Publish Date - 2020-06-05T00:45:15+05:30 IST

ఏపీ ప్రభుత్వం జులై 8 నుంచి ఇళ్ళ పట్టాల పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని చోట్ల ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరిస్తే...

అన్ని చోట్ల ఒకలా.. విశాఖలో మాత్రం ఇంకోలా..!

విశాఖ: ఏపీ ప్రభుత్వం జులై 8 నుంచి ఇళ్ళ పట్టాల పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని చోట్ల ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరిస్తే విశాఖలో మాత్రం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను సేకరించారు. అందులో ప్రభుత్వ భూములతో పాటుగా పేదలు, దళితులకు చెందిన భూములనే ఎక్కువగా లాక్కున్నారు. 


నవరత్నాలలో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. విశాఖ నగర పరిధిలో సుమారుగా లక్షా 25వేల  మంది అర్హులున్నట్లు గుర్తించారు. మిగతా చోట్ల ప్రభుత్వ భూములు పేదలకు దళితులకు ఇచ్చిన భూములను నేరుగా లాక్కుంటే విశాఖలో మాత్రం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు లాక్కుంది. ఇంతలో జీవీఎంసీ, స్థానిక ఎన్నికలు రావడంతో నిలిచింది. తర్వాత కరోనా దెబ్బకు మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ భూముల వైపు చూడటంతో ప్రజల్లో భయం మొదలైంది. 

Updated Date - 2020-06-05T00:45:15+05:30 IST