Abn logo
Sep 21 2021 @ 17:26PM

మోదీ నిర్ణయాలతో మత మార్పిడుల నియంత్రణ: స్వాత్మానందేంద్ర

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటోన్న నిర్ణయాలతో దేశంలో అన్యమత ప్రచారం, మత మార్పిడులు నియంత్రణలోకి వస్తున్నాయని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని సంస్థలు విదేశాల నుంచి మిషనరీ నిధులు తీసుకొచ్చి నిరుపేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రలోభాలకు గురి చేస్తున్నాయని తెలిపారు. విదేశాల నుండి వచ్చే నిధులపై ఆంక్షలు విధించడం ద్వారా మోడీ ప్రభుత్వం హిందూ ధర్మానికి మేలు చేసిందని ప్రశంసించారు. ఢిల్లీలో స్వామి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధర్‌ను ఆయన నివాసంలో కలిశారు. పలు ధార్మిక అంశాలపై చర్చించారు. విశాఖ శ్రీ శారద పీఠం తరపున ధర్మ పరిరక్షణకు చేపడుతున్న కృషిని, తాను చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర గురించి వివరించారు. దళితులు, గిరిజనులతో కలిసి తిరుమలకు వెళ్ళినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption