విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం

ABN , First Publish Date - 2021-08-03T14:35:54+05:30 IST

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం

చిలకలూరిపేట: విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే ఆంధ్రుల సత్తా ఏమిటో చూపిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీని చిలకలూరిపేట రాజకీయ అఖిలపక్షాలు హెచ్చరించాయి. ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి మద్ధతుగా సోమవారం చిలకలూరిపేటలో రాజకీయ అఖిలపక్షాలు, కార్మికసంఘాలు ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి కళామందిర్‌ సెంటర్‌ వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. కళామందిర్‌ సెంటర్‌లో సీఐటీయూ నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న వివిధ రాజకీయపార్టీలు, కార్మికసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పెట్టుబడిదారి విధానాలను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో నల్లమడ రైతుసంఘం అధ్యక్షులు డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు, కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రాధాకృష్ణ, టీడీపీ తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు మద్దూరి వీరారెడ్డి, సీపీఎం నాయకులు బొల్లు శంకరరావు, పోపూరి సుబ్బారావు, సీపీఐ ఏరియా ఇన్‌ఛార్జి కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ, జిల్లా ఏఐవైఎఫ్‌ కార్యదర్శి షేక్‌ సుభాని, టీడీపీ నాయకులు షేక్‌ అబ్దుల్‌కుమీర్‌, షేక్‌ జరీనాసుల్తానా, మురకొండ మల్లిబాబు, సయ్యద్‌ వహాబ్‌, తొండెపు హరిబాబు, తొండెపు వెంకయ్య, సీపీఎం నాయకులు సాతులూరి బాబు, సాతులూరి లూథర్‌, సీపీఐ నాయకులు పేలూరి రామారావు, ప్రజాసంఘాల నాయకులు నాయుడు శివకుమార్‌, ముసాబోయిన వెంకటేశ్వర్లు, బొంతా వేణు, కాంగ్రెస్‌ నాయకులు జాష్టి నాగాంజనేయులు, మాచవరపు కొండలు, అన్నపురెడ్డి వినయ్‌కుమార్‌, కోవూరు రాజా, మిరియాల వెంకటరత్నం, దాసరి శ్యామ్‌బాబు, షేక్‌ నస్రుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T14:35:54+05:30 IST