విశాఖ వేలీ ప్రిన్సిపాల్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-17T05:11:41+05:30 IST

విశాఖ వేలీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నక్కా వల్లీశ్‌నాథ్‌ (52) ఆదివారం పినాకిల్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు.

విశాఖ వేలీ ప్రిన్సిపాల్‌ మృతి
వల్లీశ్‌నాఽధ్‌

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి): విశాఖ వేలీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నక్కా వల్లీశ్‌నాథ్‌ (52) ఆదివారం పినాకిల్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు రెండు వారాల క్రితం కరోనా సోకింది.  ఆదివారం సాయంత్రం 4.45 గంటలకు కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు భార్య మీనా, తల్లి మాత్రమే ఉన్నారు. మూడు వారాల క్రితమే ఆయన తమ్ముడు కాకినాడలో కరోనాతో చనిపోయారు. వల్లీశ్‌నాథ్‌ ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేశారు. ఫిజిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు.  సెప్టెంబరు, 2016లో ఇక్కడి స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా చేశారు.  ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా తుని. విద్యాభ్యాసం ఏలూరులో జరిగింది. వల్లీశ్‌నాథ్‌ మృతి పట్ల స్కూల్‌ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.  



కరోనాతో డీవీఈవో సోమిరాజు మృతి

మద్దిలపాలెం, మే 16: కరోనాతో జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి పద్దు సోమిరాజు (46) ఆదివారం మృతి చెందారు. కరోనా లక్షణాలతో గత కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన అరకు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌లో చేరారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ క్రమంగా పడిపోవడంతో ఆదివారం కన్నుమూశారు. సీలేరు జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా చేరి ముంచంగిపుట్టు, వడ్డాది, మాడుగుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సోమిరాజుకు 2019లో జిల్లా వృత్తివిద్యాశాఖాధికారిగా పదోన్నతి లభించింది. డీవీఈవో మృతిపై జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు 


Updated Date - 2021-05-17T05:11:41+05:30 IST