Abn logo
Sep 21 2020 @ 12:20PM

మంత్రి కొడాలి వ్యాఖ్యలపై కంటతడి పెట్టిన శ్రీనివాసనంద స్వామి

విశాఖపట్నం: వెంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై  శ్రీనివాసనంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకుంటూ శ్రీనివాసనంద స్వామి కంటతడి పెట్టారు. తక్షణమే హిందూవులకు మంత్రి కొడాలి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి క్షమాపణ చెప్పపోతే.. ముఖ్యమంత్రి ఆయన చేత క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. హిందూవులు మనోభావాలు దెబ్బతీసిన మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. సీఎం స్పందించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాని వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.  బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసిన మంత్రి  కొడాలి నానిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పార్టీల అతీతంగా అందరూ స్పందించాలని శ్రీనివాసనంద స్వామి కోరారు. 

Advertisement
Advertisement
Advertisement