విశాఖపట్నం: నగరంలోని గొలుగొండ మండలం కృష్ణదేవిపేట వద్ద భారీగా గంజాయి పట్టుపడింది. పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా...ఏజెన్సీ నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.కోటి విలువైన గంజాయిని పట్టుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.