Visakha: వైసీపీ ఆఫీసులో సావిత్రి బాయి పూలే జయంతి వేడుక

ABN , First Publish Date - 2022-01-03T15:59:34+05:30 IST

ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత్రి, ఉపాధ్యాయిని సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకను నగరంలోని వైసీపీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు.

Visakha: వైసీపీ ఆఫీసులో సావిత్రి బాయి పూలే జయంతి వేడుక

విశాఖపట్నం: ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత్రి, ఉపాధ్యాయిని సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకను నగరంలోని వైసీపీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ, వరుదు కల్యాణి, పలువురు ప్రజాప్రతినిధులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ, వరుదు కల్యాణి మాట్లాడుతూమహిళా అభివృద్ధి, సాధికారత కోసం  సావిత్రి బాయి ఫూలే  విశేషంగా కృషి చేశారన్నారు. మహిళా లోకానికి సావిత్రి బాయి ఆదర్శంగా నిలిచారని... ఆమె ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-01-03T15:59:34+05:30 IST