Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఛాన్స్ మిస్ అయితే... విశాఖను రక్షించుకోవడం కష్టం: సబ్బం హరి

విశాఖ: రేపటి మున్సిపల్ ఎన్నికలు అందివచ్చిన అవకాశం అని... ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే... విశాఖను రక్షించుకోవడం కష్టమని నగర ప్రజలను మాజీ ఎంపీ సబ్బం హరి హెచ్చరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘మీరింకా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండకండి. మీరే గనుక రేపటి ఎన్నికల్లో కులానికో, మరేదానికో లొంగిపోతే.. విశాఖ కూడా మమ్మల్ని గెలిపించిందని వైసీపీ వాళ్లు విర్రవీగుతారు. ఇంకెవడూ మాట్లాడటానికి లేదు అంటారు. మీరెన్ని చెప్పినా... ప్రజలు నాకే ఓటేశారని చెప్పి... ఇంకా అరాచకాలకు పాల్పడే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసినా, పోలవరం ఎత్తు తగ్గించినా.. ఏది చేసినా తమకేం కాదంటారు. ఈ ఎన్నికల్లో జనం తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకపోతే... విశాఖను రక్షించుకోవడం కష్టం. మీ తీర్పు ద్వారా వాళ్లకు కళ్లు తెరిపించాలి. ఇది జరిగిన తర్వాత నెత్తినోరు కొట్టుకున్నా ఇంకేమీ ఉండదు. విశాఖ పట్టణాన్ని రక్షించుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. ఇదే నా అభ్యర్థన’’ అని ఆయన ఉద్వేగానికి గురయ్యారు. 

Advertisement
Advertisement