Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైకోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విచారణ

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. స్టీల్ ప్లాంట్‌ తరఫున కేంద్ర ఆర్థిక, ఉక్కు, గనులు శాఖలను కౌంటర్ వేయాలని గతంలో న్యాయస్థానం కోరింది. ఆర్థిక శాఖ తరఫున వేసిన కౌంటరే మిగిలిన శాఖలకు వర్తిస్తుందన్న కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయాలను కౌంటర్‌లో పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ ప్రస్తావించారు. ప్రైవేటీకరణ సమయలో భాగస్వాములు అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని బాలాజీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారు. కేంద్రం వేసిన కౌంటర్‌పై రిజైన్డర్ వేసేందుకు రెండు వారాల సమయం కావాలని కోర్టును బాలాజీ కోరారు. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement
Advertisement