నవంబర్ 3న అప్పు తీరుస్తానని చెప్పి.. అంతలోనే

ABN , First Publish Date - 2020-11-03T19:59:21+05:30 IST

అవసరానికి తీసుకున్న అప్పులు ఆ యువతికి తలకుమించిన భారం అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు వరుస పెట్టి ఫోన్లు చేస్తుండటంతో.. చివరికా ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

నవంబర్ 3న అప్పు తీరుస్తానని చెప్పి.. అంతలోనే

విశాఖ: అవసరానికి తీసుకున్న అప్పులు ఆ యువతికి తలకుమించిన భారం అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు వరుస పెట్టి ఫోన్లు చేస్తుండటంతో.. చివరికి ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్టణంలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే వెంకట సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు. ఆటోనగర్‌లోని ఓ కంపెనీలో సత్యనారాయణ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద కుమార్తె పేరు ఆహ్లాద. ఆమె ఆన్ లైన్‌లో చిన్న చిన్న లోన్‌లు తీసుకుంది. అయితే అప్పు తీర్చాల్సిన గడువుదాటి పోవడంతో సదరు కంపెనీ వాళ్లు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కానీ ఆమెకు ఎక్కడా డబ్బు పుట్టలేదు. కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయినా తాను లోన్ తీసుకున్న ఎజెంట్లు అందరికీ ఈ నవంబర్ 3న అప్పు తీరుస్తానని చెప్పుకొచ్చింది. మంగళవారం ఉదయం ఆమె తల్లి బ్యాంకుకు, తండ్రి ఆలయానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పు తీరుస్తానని మాట ఇచ్చిన ఆహ్లాద... వాళ్లందరూ వస్తారన్న భయంతో, అవమానంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు అంటున్నారు. 

Updated Date - 2020-11-03T19:59:21+05:30 IST