నేడు విశాఖ-రాయపూర్‌ రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2021-05-05T05:40:58+05:30 IST

సంబల్‌పూర్‌ డివిజన్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపఽథ్యంలో విశాఖ-రాయపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను బుధవారం ఒక్క రోజు తాత్కాలికంగా రద్దు చేయగా...కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పూరి-గుణుపూర్‌ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను బుధవారం నుంచి రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

నేడు విశాఖ-రాయపూర్‌  రైళ్లు రద్దు

నేటి నుంచి పూరి-గుణుపూర్‌ ప్రత్యేక రైళ్లు రద్దు

విశాఖపట్నం, మే 4: సంబల్‌పూర్‌ డివిజన్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపఽథ్యంలో విశాఖ-రాయపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను బుధవారం ఒక్క రోజు తాత్కాలికంగా రద్దు చేయగా...కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పూరి-గుణుపూర్‌ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను బుధవారం నుంచి రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. అలాగే యశ్వంత్‌పూర్‌, హౌరా మధ్య నడస్తున్న ప్రత్యేక రైళ్ల రాకపోకల ట్రిప్పులను కుదిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖ మీదుగా మైసూరు నుంచి దనపూర్‌కు (ఒక వైపు మాత్రమే) ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు ప్రకటించారు. 

రద్దైన రైళ్లు

సంబల్‌పూర్‌ డివిజన్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ, రాయపూర్‌ మధ్య నడుస్తున్న 08528, 08527 నంబరు గల ప్రత్యేక రైళ్లు బుధవారం రద్దు చేశారు. పూరి నుంచి గుణుపూర్‌ వెళ్లే 08417 నంబరు గల రైలు బుధవారం నుంచి....గుణుపూర్‌ నుంచి పూరి వెళ్లే 08418 నంబరు గల రైలు గురువారం నుంచి రద్దు చేశారు.

మైసూర్‌ నుంచి దనపూర్‌కు ప్రత్యేక రైలు (ఒక వైపు మాత్రమే)

06216 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల ఆరున (గురువారం) ఉదయం 11:00 గంటలకు మైసూరులో బయలుదేరి మర్నాడు(శుక్రవారం) రాత్రి 7:55 గంటలకు విశాఖ చేరి తిరిగి 8:15 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి శనివారం రాత్రి 8:45 గంటలకు దనపూర్‌ చేరుతుంది. 

యశ్వంత్‌పూర్‌-హౌరా-యశ్వంత్‌పూర్‌ రైళ్ల ట్రిప్పుల కుదింపు

కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్ల ట్రిప్పులను కుదించారు.  యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా వెళ్లే 06597 నంబరు గల రైలు ఈ నెల ఆరు వరకు, హౌరా నుంచి యశ్వంత్‌పూర్‌ వెళ్లే 06598 నంబరు గల రైలు ఈ నెల 11వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో వుంటుంది. 


Updated Date - 2021-05-05T05:40:58+05:30 IST