విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో చిన్నారి తీవ్ర అస్వస్థత.. ఇప్పుడెలా ఉన్నాడంటే...

ABN , First Publish Date - 2020-05-27T23:06:49+05:30 IST

మే 7వ తేదీ రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య ఒక కాల రాత్రిగా వెంకటాపురం వాసులకు మిగిలింది. ఇప్పటికీ కూడా వెంకటాపురంలో ఎల్జీ పాలిమిర్స్ అనగానే...

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో చిన్నారి తీవ్ర అస్వస్థత.. ఇప్పుడెలా ఉన్నాడంటే...

విశాఖ: మే 7వ తేదీ రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య ఒక కాల రాత్రిగా వెంకటాపురం వాసులకు మిగిలింది. ఇప్పటికీ కూడా వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ అనగానే ఒక భయానక దృశ్యాలు వాళ్ల కళ్ల ముందు కదిలాడుతున్నాయి. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు చిన్నారులు నేలపై పడిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. సీసీ ఫుటేజ్‌లో చూసి అంతా షాక్‌కు గురయ్యారు. చికిత్స పొందిన లోహిత్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. చలాకీగా ఆడుకుంటున్నారు. ఆ రోజు ముక్కుకు దెబ్బతగిలిందని, చికిత్స తర్వాత తగ్గిందని లోహిత్ చెబుతున్నారు. ‘‘ఆ రోజు తెల్లవారు జామున 3గంటలకు విపరీతమైన దుర్వా వాసన వచ్చింది. దాని వల్ల గొంతు, కళ్లలో మంటలు వచ్చాయి.’’ అని తల్లిదండ్రులు చెప్పారు. 

Updated Date - 2020-05-27T23:06:49+05:30 IST