విశాఖలో శివ తాండవం.. ఢిల్లీలో శంకరాభరణం

ABN , First Publish Date - 2021-03-08T10:11:19+05:30 IST

‘సీఎం జగన్‌ ది బెస్ట్‌ కాదు.. ది వరెస్ట్‌ చీఫ్‌ మినిస్టర్‌గా మారాడు. విశాఖ ఉక్కు పరిశ్రమపై విశాఖలో శివ తాండవ.. ఢిల్లీలో శంకరాభరణం చేస్తున్నారు.

విశాఖలో శివ తాండవం.. ఢిల్లీలో శంకరాభరణం

రాజకీయాల్లో జగన్‌కు అభిమన్యుడి గతే

ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యే వరకూ ఠాగూర్‌ గెట్‌పలోనే పీఎం మోదీ

సోము వీర్రాజు ఓ పిచ్చి కుక్క: నారాయణ


అనంతపురం, మార్చి7(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్‌ ది బెస్ట్‌ కాదు.. ది వరెస్ట్‌ చీఫ్‌ మినిస్టర్‌గా మారాడు. విశాఖ ఉక్కు పరిశ్రమపై విశాఖలో శివ తాండవ.. ఢిల్లీలో శంకరాభరణం చేస్తున్నారు. ఇక్క డ పాదయాత్ర చేస్తూ డిల్లీలో పాదపూజ చేస్తున్నా రు. మోదీకి అనుకూలంగా పాదాలు నొక్కుతూ వైసీపీ నేతలు తాబేదారులుగా మారారు’’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆదివారం ఆయన అనంతపురం వచ్చారు. మీడియాతో మా ట్లాడారు. ఉక్కు పరిశ్రమపై విజయసాయిరెడ్డి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఇక సీఎం జగన్‌ ప్రధానికి రాసిన మన్మథ లేఖకు అమ్మాయిలు వలలో పడుతారేమోగానీ.. ప్రధాని మోదీ ఏ మాత్రం పడరన్నారు.


వాళ్ల ఆవిడకే ఆ యన పడలేదంటూ చమత్కరించారు. నిజంగా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలనే ఉద్దే శ్యం సీఎం జగన్‌కు ఉంటే అఖిలపక్ష సమావేశాని కి చంద్రబాబును అధికారికంగా పిలవాల్సిన బాధ్య త ఆయనపై ఉందన్నారు. రూ.2 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రూ.5 వేల కోట్లకు అమ్ముతుంటే ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించా రు. రాజకీయంగా జగన్‌కి అభిమన్యుడి గతే పడుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు అవసరం లేకుండా మీ ఫ్రెండ్‌ ప్రధాని మోదీతో పర్మిషన్‌ తీసుకొని రేపిస్టులు, కూనీకోర్లు, డెకాయిట్లు నామినేట్‌ చేసుకు న్నా.. తమకు అభ్యంతరం లేదన్నారు.  ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ప్రధాని మోదీ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గెట్‌పలోనే ఉంటారన్నారు. ఇదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపైనా నిప్పులు చెరిగారు. ‘సోము వీర్రాజు ఓ పిచ్చి కుక్క. అతను బయట ఉండటం మంచిది కాదు’ అని నారాయణ అన్నారు. 

Updated Date - 2021-03-08T10:11:19+05:30 IST