మరో వాయు‘గండం’

ABN , First Publish Date - 2020-10-22T09:13:26+05:30 IST

మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి, వాయుగుండంగా

మరో వాయు‘గండం’

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి, వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తరువాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మరింత బలపడి పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల దిశగా పయనిస్తుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తూర్పు-పశ్చిమ ద్రోణి 1.5-5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో బుధవారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ, దక్షిణకోస్తాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన కురిసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Updated Date - 2020-10-22T09:13:26+05:30 IST