Abn logo
Sep 18 2020 @ 12:55PM

దీపావళికి ఓటీటీలో విశాల్‌ చిత్రం

Kaakateeya

విశాల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'చక్ర'. తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ నాలుగు ద‌క్షినాది భాష‌ల్లో ఒకేసారి విడుదలవుతుంది. ఎం.ఎస్‌.ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తున్నారు. వీరితోపాటు రెజీనా, రోబో శంకర్‌, సృష్టి డాంగే, మనోబాలా తదితరులు నటించారు. సీనియర్‌ నటి కేఆర్‌ విజయ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. రెజీనా కసండ్ర ఇందులో విలన్‌గా నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీస్‌ బ్యానర్‌పై విశాల్‌ నిర్మించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో దీపావళికి ఈ చిత్రం ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ నిర్వాహకులు తెలిపారు. బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో సరికొత్త క‌థ, క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది.


Advertisement
Advertisement
Advertisement