May 7 2021 @ 00:09AM

విశాల్‌ కొత్త చిత్రం ప్రారంభం!

విశాల్‌ హీరోగా నటిస్తూ, సొంత బేనర్‌ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీలో నిర్మిస్తోన్న తాజా చిత్రం షూటింగ్‌ గురువారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. హీరోగా ఆయనకు ఇది 31వ చిత్రం. తూపా శరవణన్‌ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయవుతున్నారు. డింపుల్‌ హయతి కథానాయికగా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. విశాల్‌ ప్రస్తుతం ‘తుప్పరివాలన్‌ 2’ చిత్రంలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్యతో కలసి ‘ఎనిమీ’ చిత్రంలో నటిస్తున్నారు.