Abn logo
Nov 22 2020 @ 16:38PM

తెలుగుభాషకు చేస్తున్న విశిష్టసేవకు గౌరీశంకర్‌కు పురస్కారం

Kaakateeya

హైదరాబాద్‌: సామాజిక, సాహిత్య రంగంలో తెలుగు భాషకు చేస్తున్న విశిష్టసేవలకుగాను విశాల సాహిత్య అకాడమీ స్వామీ పొన్నాల గౌరీశంకర్‌కు బిఎస్‌ రాములు ప్రతిభా పురస్కారాన్ని అందజేసింది. గతంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం దేశ వ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేసి , యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని, మన్మోహన్‌ సింగ్‌ను కలిసి తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించి పెట్టిన పొన్నాల గౌరీశంకర్‌కు ఈ పురస్కారం ఇచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. 


ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ కలలుకంటున్న ఆకుపచ్చ తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు. సతతం హరితహారం సైకిల్‌యాత్ర చేస్తూ మొక్కలు నాటుతూ, నాటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు విశాల సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో బిఎస్‌ రాములు సాహిత్య సమాలోచన, సప్తతి మహోత్సవం సందర్భంగా పొన్నాల గౌరీశంకర్‌కు బిఎస్‌రాములు పురస్కారం అందజేశారు. 

Advertisement
Advertisement