Oct 21 2021 @ 21:14PM

విష్ణు విశాల్‌ ‘మోహన్‌దా‌స్’ సెకండ్‌ లుక్‌ విడుదల

విష్ణు విశాల్‌ హీరోగా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ వివి స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘మోహన్‌దాస్’. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా, బుధవారం సెకండ్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో హీరో విష్ణు విశాల్‌ రక్తపు చేతులతో సుత్తిని పట్టుకునివుండగా, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు అనే అర్థం స్ఫురించేలా మూడు కోతుల బొమ్మలు ఉన్నాయి. నాలుగో కోతి బొమ్మ తలవంచి నేలను చూస్తుండేలా సెకండ్‌ లుక్‌ను డిజైన్‌ చేసి, చీర్స్‌ మేట్‌ అంటూ ఇంగ్లీష్‌ అక్షరాలతో రాశారు. మురళి కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గాను, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, షారీక్‌ హాసన్‌, ప్రకాష్‌ రాఘవన్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌ తదితరులు ఇతర పాత్రలలోనూ నటించారు. కేఎస్‌ సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. చెన్నైతోపాటు, పరిసర ప్రాంతల్లో షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.