‘అయోధ్య భూమి పూజ ప్రసారాల విషయంలో భక్తుల విజయం’

ABN , First Publish Date - 2020-08-11T04:23:25+05:30 IST

తిరుమల ఎస్వీబీసీ అయోధ్య భూమి పూజ ప్రసారాల విషయంలో భక్తులు విజయం సాధించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అయోధ్య భూమి పూజ విషయంలో టీటీడీ

‘అయోధ్య భూమి పూజ ప్రసారాల విషయంలో భక్తుల విజయం’

విజయవాడ: తిరుమల ఎస్వీబీసీ అయోధ్య భూమి పూజ ప్రసారాల విషయంలో భక్తులు విజయం సాధించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అయోధ్య భూమి పూజ విషయంలో టీటీడీ తిరుమల దేవస్థానం ప్రసారాలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన కారకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ, శ్రీవారి భక్తులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన టీటీడీ ఎస్వీబీసీ భక్తి ఛానల్ సీఈఓ వెంకట నాగేష్‌ను తొలగించింది. కొత్త సీఈఓగా కేంద్ర సమాచార శాఖ అధికారి సురేష్ కుమార్‌ గెదెలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. ప్రభుత్వం, టీటీడీ చర్యను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరోసారి ఇలాంటి చర్యలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. నూతన సీఈఓ సురేష్ కుమార్.. భక్తుల మనోభావాలకు తగ్గట్లుగా ధార్మిక కార్యక్రమాలతో ఛానల్‌ను నిర్వహించాలని బీజేపీ ఆకాంక్షిస్తోందని విష్ణువర్ధన్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T04:23:25+05:30 IST