Advertisement
Advertisement
Abn logo
Advertisement

దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా వ్యక్తి.. నిజమేంటో తెలుసుకుని కంగుతిన్న అధికారులు

దుబాయి: మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ అధికారులకు చిక్కిన ఓ వ్యక్తికి దుబాయి కోర్టు జైలు శిక్ష విధించడంతోపాటు భారీగా జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే..ఆఫ్రికాకు చెందిన 47ఏళ్ల ఓ వ్యక్తి.. విజిట్ వీసాపై దుబాయి బయల్దేరాడు. దుబాయికి చేరుకున్న అనంతరం ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా ప్రవర్తించాడు. దీంతో కస్టమ్స్ అధికారులు.. అతని లగేజీని పరిశీలించారు. అయితే అందులో అనుమానాస్పదంగా ఏం లేకపోవడంతో తిరిగి దాన్ని ఆ వ్యక్తికి ఇచ్చారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. కంగారుపడట్టాన్ని కమనించారు. దీంతో శరీరాన్ని ఎక్స్ రే తీశారు.


ఈ క్రమంలో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కడుపులో సుమారు 49 కొకైన్ కాప్సుల్స్‌ను గుర్తించి కంగుతిన్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. యూఏఈలో విక్రయించేందుకే అక్రమ రవాణా చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2020 మేలో జరగ్గా.. దీనిపై విచారణ జరిపిన దుబాయి క్రిమినల్ కోర్టు ఆ 47ఏళ్ల వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా 50వేల దిర్హమ్‌ల ఫైన్‌ను కూడా కట్టాలంటూ ఆదేశాలు చేసింది. ఇదిలా ఉంటే.. జైలు శిక్ష పూర్తైన తర్వాత సదరు వ్యక్తి.. యూఏఈని విడిచి వెళ్లాల్సి ఉంటుంది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement