విస్టాడోమ్‌కు అపూర్వ ఆదరణ: నెలాఖరు వరకు టికెట్లన్నీ ఫుల్‌

ABN , First Publish Date - 2021-08-03T18:02:13+05:30 IST

పశ్చిమకనుమల ప్రకృతి సౌందర్యాన్ని కనులారా తిలకించేందుకు అపూర్వ అవకాశం కల్పిస్తున్న విస్టాడోమ్‌ రైలుకు ప్రజలనుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. నెలాఖరువరకు టికెట్‌లన్నీ బుకింగ్‌ కావడమే

విస్టాడోమ్‌కు అపూర్వ ఆదరణ: నెలాఖరు వరకు టికెట్లన్నీ ఫుల్‌

 బెంగళూరు: పశ్చిమకనుమల ప్రకృతి సౌందర్యాన్ని కనులారా తిలకించేందుకు అపూర్వ అవకాశం కల్పిస్తున్న విస్టాడోమ్‌ రైలుకు ప్రజలనుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. నెలాఖరువరకు టికెట్‌లన్నీ బుకింగ్‌ కావడమే ఇందుకు నిదర్శనమని రైల్వేశాఖ అధికారి ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు. జూలై 11న విస్టాడోమ్‌ రైలు సంచారం యశ్వంతపురం రైల్వే స్టేషన్‌ నుంచి మంగళూరు జంక్షన్‌ల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలులో ప్రయాణించేందుకు టికెట్‌లు లభించకపోవడంతో ప్రకృతి ప్రియులు నిరాశ చెందుతున్నారు. విస్టాడోమ్‌లో ప్రయాణించేందుకు రూ.1600 చార్జీగా ఉంది. ప్రత్యేకించి వారాంతపు రోజుల్లో భారీ డిమాండ్‌ నెలకొని ఉందని అధికారులు తెలిపారు. యశ్వంతపురం నుంచి మంగళూరుకు వెళ్లే రైలులోని ఈ రెండు కోచ్‌లకు డిమాండ్‌ అధికం కావడంతో అదనంగా మరో కోచ్‌ను జోడించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. మరో రెండు నెలల్లో అదనపు కోచ్‌ అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా జూలై 11నుంచి 29వరకు ఈ రైలులో సుమారు 3 వేలమంది ప్రయాణించారు. ఒక్కో బోగీలో 44సీట్లు ఉన్నాయి. రెండు బోగీలలో కలిపి 88మంది మాత్రమే ప్ర యాణించేందుకు అవకాశం ఉంది.

Updated Date - 2021-08-03T18:02:13+05:30 IST