విశ్వకర్మ జయంతిని కార్మిక దినంగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-09-18T07:11:20+05:30 IST

పంచవృత్తుల బ్రహ్మ విరాట్‌ విశ్వకర్మ జయంతిని కార్మిక దినంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మ సంఘం అధ్యక్షుడు గుమ్మడిపూడి కల్యాణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

విశ్వకర్మ జయంతిని కార్మిక దినంగా ప్రకటించాలి
విశ్వకర్మ జయంతి పూజల్లో విశ్వ బ్రాహ్మణులు

నెల్లూరు (సాంస్కృతికం) సెప్టెంబరు 17 : పంచవృత్తుల బ్రహ్మ విరాట్‌ విశ్వకర్మ జయంతిని కార్మిక దినంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మ సంఘం అధ్యక్షుడు గుమ్మడిపూడి కల్యాణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా శుక్రవారం సంతపేట కంసాలి వీధిలోని హరిహరనాథస్వామి ఆలయంలో విశ్వ బ్రాహ్మణులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కల్యాణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందిగానీ దానికి నిధులు, విధులు లేవని ఆరోపించారు. ఆ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బీ జానకిరామయ్య, స్వర్ణకార పరిషత్‌ అధ్యక్షుడు ఆర్కాట్‌ మురిగేష్‌ఆచారి, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్కాట్‌ గణేష్‌ఆచారి,  కోశాధికారి అక్కరపాక జయచంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. 

నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలోనూ విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయి. విరాట్‌నగర్‌లోని వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గాయత్రి సమేత విశ్వకర్మకు పూజలు జరిగాయి. ఆలయం ముందు పంచవృత్తుల పతాకాన్ని ఆవిష్కరించి కందుకూరి చెంగయ్యఆచారి తదితరులు వందన సమర్పణ చేశారు. 

Updated Date - 2021-09-18T07:11:20+05:30 IST