విటమిన ఏమయ్యింది!

ABN , First Publish Date - 2021-12-09T04:48:31+05:30 IST

చిన్నారుల కంటి చూపు మెరుగు పరచడంలో విటమిన ఏ ద్రావణం చాలా కీలకం.

విటమిన ఏమయ్యింది!
విటమిన ఏ ద్రావణం



ఫోటోవార్త :

1 ప్రసాద్‌ 7 : 

2 ప్రసాద్‌ 7 : డాక్టర్‌ రాజ్యలక్ష్మి

ఏడాదిగా జిల్లాకు ఆగిన సరఫరా

3 లక్షల మంది చిన్నారుల ఎదురు చూపు 


నెల్లూరు(వైద్యం) డిసెంబరు 8 : చిన్నారుల కంటి చూపు మెరుగు పరచడంలో విటమిన ఏ ద్రావణం చాలా కీలకం. అలాంటి ద్రావణం ఏడాది కాలంగా జిల్లాకు సరఫరా కావడంలేదు. జిల్లావ్యాప్తంగా 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 477 ఆరోగ్య ఉపకేంద్రాలు, 3 ఏరియా ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఉన్నా ఎక్కడా ఆ ద్రావణం లభించడంలేదు.  దీంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 


ఏడాదిగా అందుబాటులో లేదు 


సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు విటమిన ఏ ద్రావణం ప్రభుత్వం సరఫరా చేసే ఏడాదికిపైగా అవుతోంది. గతేడాది నవంబరులో పీహెచసీలకు సరఫరా చేసిన విటమిన ఏ ద్రావణం వినియోగం జరిగిపోవడంతో ప్రస్తుతం కొరత ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సరఫరా చేసే ద్రావణం కొరత ఉన్నా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకోకపోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. కనీసం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర నిధులతో అయినా విటమిన ఏ ద్రావణం కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా 3 లక్షల మంది చిన్నారులు ఈ ద్రావణం కోసం ఎదురు చూస్తున్నారు. 


ద్రావణం తీసుకోకుంటే..


9 నెలలు నిండిన చిన్నారులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి విటమిన ఏ ద్రావణం మింగించాలి. ఒక డోస్‌ పూర్తయిన మరో ఆరు నెలలకు ఖచ్చితంగా  మరో డోస్‌ వేయాలి. ఐదేళ్ల వరకు ఈ విధానం అనుసరించాలి. లేదంటే కంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. శరీరంలో విటమిన ఏ లోపిస్తే ఎముకలు సరిగ్గా పెరగవు. బలహీనంగా మారతాయి, మూత్రాశయంలో ఇనఫెక్షన, శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి, శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది. చర్మం పొడిబారుతుంది, చర్మంలో సహజ సిద్ధమైన తైలాలు శ్రవించవు. కంటిచూపు మందగిస్తుంది. దీర్ఘకాలికంగా అయితే శుక్లాల సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో విటమిన ఏ ద్రావణం తప్పనిసరిగా చిన్నారులకు అందించాలి.  


విటమిన ఏ అందుబాటులో లేదు

 డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచవో

జిల్లా వ్యాప్తంగా విటమిన ఏ ద్రావణం కొరత ఉంది. ఏడాది కాలంగా ప్రభుత్వం సరఫరా లేదు. దీంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో విటమిన ఏ ద్రావణం పంపిణీ చేయలేక పోతున్నాం. ప్రజలు కూడా కూడా విటమిన ఏ ద్రావణం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం వైపునుంచి కూడా ఈ విటమిన ఏ ద్రావణం ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. వెంటనే ప్రభుత్వం విటమిన ఏ ద్రావణం కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి ఉంది. 

Updated Date - 2021-12-09T04:48:31+05:30 IST