డీ విటమిన్‌తో కరోనా మరణాలకు చెక్!

ABN , First Publish Date - 2020-05-26T01:18:52+05:30 IST

డీ విటమిన్ కరోనాకు చెక్ పెట్టగలదా

డీ విటమిన్‌తో కరోనా మరణాలకు చెక్!

న్యూఢిల్లీ: కరోనా బారిన పడ్డ వారిలో మరణం ఎలా సంభవిస్తుందనే దానిపై ఇప్పటికే చాలా విషయాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్ దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న రోగ నిరోధక వ్యవస్థ.. కరోనాను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున వైరస్ కణాలపై దాడికి దిగుతుంది. అందుబాటులో ఉన్న అస్త్రాలన్ని ఒకేసారి ప్రయోగిస్తుంది. దీన్నే శాస్త్రపరిభాషలో సైటోకైన్ స్టార్మ్ అంటారు. అయితే ఇది అత్యంత తీవ్రమైన స్పందన కావడంతో శరీరంపై కూడా ప్రతికూల ప్రభావం పడి.. రోగి మరణిస్తాడు. అత్యధిక సందర్భాల్లో కరోనా మరణం వెనుక ఉన్నది సైటోకైన్ స్ట్రామ్ అని శాస్త్రవేత్తుల ఇప్పటికే నిరూపించారు. అయితే.. సైటోకైన్ స్టార్మ్ తీవ్రతను తగ్గించగలిగితే మరణాల సంఖ్యను కూడా అదుపులోకి చేయచ్చని భావిస్తున్న శాస్త్రవేత్తులకు కనిపించిన కొత్త ఆశాకిరణం విటమిన్ డీ. దీని తీవ్రతను తగ్గించే శక్తి విటమిన్ డీకి ఉందని అమెరికాకు చెందిన హార్వర్డ్ హ్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అంతే కాకుండా.. ప్రముఖ మెడికల్ జర్నల్ లాంసెట్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వివిధ దేశాల్లోని కరోనా మరణాల సంఖ్య ఆయా దేశాల జనాభాలోని విటమిన్ డీ స్థాయి బట్టి కూడా ఉంటుందని వెల్లడైంది. ప్రజల్లో విటమిన్ డీ స్థాయిలు తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్టు లాంసెట్‌లోని అధ్యయనంలో వెల్లడైంది. 

Updated Date - 2020-05-26T01:18:52+05:30 IST