80% మంది కరోనా రోగుల్లో..

ABN , First Publish Date - 2020-10-29T06:33:32+05:30 IST

కరోనా బారినపడుతున్న 80% ...

80% మంది కరోనా రోగుల్లో..

లండన్‌, అక్టోబరు 28: కరోనా బారినపడుతున్న 80% మందిలో ‘డీ’ విటమిన్‌ లోపం ఉందని స్పెయిన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో డీ విటమిన్‌ తక్కువగా ఉందన్నారు. డీ విటమిన్‌ లోపించిన వారి రక్తప్రసరణ వ్యవస్థలో కీలక మార్పులు జరిగినట్లు గుర్తించారు. ఆ రోగుల్లో ఐరన్‌ను నిల్వ చేసే ప్రొటీన్‌ ‘ఫెర్రిటిన్‌’, గడ్డకట్టిన రక్తం మళ్లీ సాధారణ స్థితికి చేరి న తర్వాత రక్తంలో కనిపించే ‘డీ-డైమర్‌’ అనే ఫైబ్రిన్‌ డీగ్రేడేషన్‌ ప్రోడక్ట్‌(ఎ్‌ఫడీపీ)ల మోతాదు గణనీయం గా పెరుగుతోందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, వృద్ధులు, ఆరోగ్య సిబ్బందిపై దీని ప్రభావం పడుతోందన్నారు.

Updated Date - 2020-10-29T06:33:32+05:30 IST