Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 18 2021 @ 10:15AM

CBIకి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడి లేఖ

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి... సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యకేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘మూడు రోజుల కిందటే మా నాన్న భుజానికి ఆపరేషన్‌ జరిగింది. మా నాన్న భుజానికి ఇంకా నొప్పి ఉంది. ఆయన పనులు ఆయన చేసుకోలేక పోతున్నారు. మాకు న్యాయం చేయాలని’’ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి లేఖలో కోరారు. 


వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ కోసం  ఈరోజు తెల్లవారుజాము సికింద్రాబాద్ న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో శివశంకర్ రెడ్డిని కడపకు తరలించారు. శివశంకర్ రెడ్డిని ఈరోజు పులివెందుల కోర్టులో సీబీఐ హాజరుపర్చనుంది.

Advertisement
Advertisement