వివేకానంద డే క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు

ABN , First Publish Date - 2021-03-09T04:10:50+05:30 IST

హైదరాబాద్: వివేకానంద డే క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది. 1893 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన ఫిబ్రవరి 13ను

వివేకానంద డే క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు

హైదరాబాద్: వివేకానంద డే క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది. 1893 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో యువత సంతకాల సేకరణ చేపట్టింది. ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా కూడా మద్దతు కూడగడుతోంది. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో మీడియా సంస్థలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, మేధావులు, విద్యావంతులు క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు. వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు క్యాంపెయిన్‌కు మద్దతు ప్రకటించారు. స్వామి వివేకానంద పోస్టర్లపై సంతకాలు చేశారు. 


కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కూడా క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు. తెలంగాణ అసెంబ్లీలో తాను ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించాలనే అంశాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. క్యాంపెయిన్‌కు మద్దతుగా స్వామి వివేకానంద పోస్టర్‌పై సంతకం చేశారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా క్యాంపెయిన్‌కు మద్దతిచ్చారు. మంజీరా గ్రూప్ సీఎండీ యోగానంద్ గజ్జల కూడా వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతు తెలిపారు. 


హైదరాబాద్‌లోని వివిధ విద్యా సంస్ధలు ఇప్పటికే వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతిచ్చాయి. రామకృష్ణ మఠం వాలంటీర్లు తెలంగాణలోని నలుమూలలకూ ఈ క్యాంపెయిన్‌ను తీసుకెళ్తున్నారు. ప్రజా మద్దతు కూడగడుతున్నారు. స్వామి వివేకానంద హైదరాబాద్‌లో పర్యటించడం భాగ్యనగర వాసులందరికీ గర్వకారణమని హైదరాబాద్ యూత్ అంటోంది. వివేకానంద సందర్శనం పేరుతో రూపొందించిన ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా వివేకానంద అభిమానులు తమ మద్దతు తెలియజేయవచ్చునని వాలంటీర్లు సూచిస్తున్నారు.  

Updated Date - 2021-03-09T04:10:50+05:30 IST