Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా ఇదే

ముంబై: అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ముంబై ఇండియన్స్ జట్టు రూ. 16 కోట్లతో రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. 12 కోట్లతో బుమ్రాను, రూ. 8 కోట్లతో సూర్యకుమార్ యాదవ్‌ను, రూ. 6 కోట్లతో పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది.ఇక విరాట్ కోహ్లీని ఆర్‌సీబీ రూ. 15 కోట్లతో రీటైన్ చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌‌ను, రూ. 11 కోట్లతో, సిరాజ్‌కు రూ.7 కోట్లతో ఆర్‌సీబీ రీటైన్ చేసుకుంది. 


మయాంక్ అగర్వాల్‌ను రూ.12 కోట్లతో, అర్షదీప్‌ సింగ్‌ను 4 కోట్లతో పంజాబ్ కింగ్స్ జట్టు రీటైన్ చేసుకుంది. కేన్ విలియమ్సన్‌ను రూ. 14 కోట్లు, అబ్దుల్ సమద్‌ను రూ.4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్‌ను రూ. 4 కోట్లతో   సన్ రైజర్స్ జట్టు రీటైన్ చేసుకుంది. రవీంద్ర జడేజాను రూ.16 కోట్లతో, ఎంఎస్ ధోనీని రూ.12 కోట్లతో, మొయినీ అలీని రూ. 8 కోట్లతో, రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.6 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రీటైన్ చేసుకుంది. రిషబ్‌ పంత్‌ను రూ.16 కోట్లతో, అక్షర్ పటేల్‌ను రూ.9 కోట్లతో, పృథ్వీ షాను ఏడున్నర కోట్ల రూపాయలతో ఢిల్లీ కేపిటల్స్ జట్టు రీటైన్ చేసుకుంది. రస్సెల్‌ను రూ.12 కోట్లతో వెంకటేశ్ అయ్యర్‌ను, రూ. 8 కోట్లతో వరుణ్ చక్రవర్తిని, సునీల్ నరైన్‌ను రూ. 6 కోట్లతో కోల్‌కతా జట్టు రీటైన్ చేసుకుంది. సంజు శాంసన్‌ను రూ.14 కోట్లతో, జోస్ బట్లర్‌ను రూ.10 కోట్లతో, యశస్వి జైశ్వాల్‌ను రూ.4 కోట్లతో రాజస్థాన్ జట్టు రీటైన్ చేసుకుంది. 

TAGS: IPL
Advertisement
Advertisement