అద్భుత ఫీచర్లతో వివో వి21 5జీ స్మార్ట్‌ఫోన్..

ABN , First Publish Date - 2021-04-25T02:01:22+05:30 IST

అద్భుత ఫీచర్లతో వివో వి21 5జీ స్మార్ట్‌ఫోన్..

అద్భుత ఫీచర్లతో వివో వి21 5జీ స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. భారత మార్కెట్‌లో ఏప్రిల్ 29న వివో వి21 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయన్నట్లు సంస్థ తెలిపింది. వివో వి21 5జీ స్మార్ట్‌ఫోన్ 3జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌లో వాటర్‌డ్రాప్ తరహా నాచ్ డిస్‌ప్లే ఉండవచ్చని సంస్థ తెలిపింది. వివో వి21 5జీ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వివో వి21 5జీ స్మార్ట్‌ఫోన్ 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వివో వి21 5జీ స్మార్ట్‌ఫోన్ ధరను మాత్రం సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.

Updated Date - 2021-04-25T02:01:22+05:30 IST