వివో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

ABN , First Publish Date - 2021-08-17T22:57:00+05:30 IST

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. వివో స్మార్ట్‌ఫోన్లపై ధరలను తగ్గించినట్లు సంస్థ పేర్కొంది.

వివో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. వివో స్మార్ట్‌ఫోన్లపై ధరలను తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. వివో ఎక్స్60 స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. తగ్గించిన ధరతో వివో ఎక్స్60 స్మార్ట్‌ఫోన్‌ రూ. 34,990కే లభించనుందని కంపెనీ పేర్కొంది. విడుదల చేసిన సమయంలో 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వివో ఎక్స్60 స్మార్ట్‌ఫోన్ రూ. 37,990 ఉండగా.. తగ్గించిన ధరతో ప్రస్తుతం వివో ఎక్స్60 స్మార్ట్‌ఫోన్ రూ.34,990కే అందుబాటులో ఉంటుంది.


వివో ఎక్స్60 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

6.56 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంటుంది. 13 మెగాపిక్సెల్ సెన్సార్, 13మెగాపిక్సెల్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది.

Updated Date - 2021-08-17T22:57:00+05:30 IST