మెయిన్స్‌ బీఆర్క్‌లో విశాఖ విద్యార్థికి రెండో ర్యాంకు

ABN , First Publish Date - 2020-09-19T09:26:15+05:30 IST

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో ప్రవేశాలకు ఈ నెలలో నిర్వహించిన (జేఈఈ మెయిన్స్‌...బీఆర్క్‌) ప్రవేశ పరీక్షలో వంద శాతం మార్కులు సాధించడం

మెయిన్స్‌ బీఆర్క్‌లో విశాఖ విద్యార్థికి రెండో ర్యాంకు

ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు


విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో ప్రవేశాలకు ఈ నెలలో నిర్వహించిన (జేఈఈ మెయిన్స్‌...బీఆర్క్‌) ప్రవేశ పరీక్షలో వంద శాతం మార్కులు సాధించడం ద్వారా విశాఖ విద్యార్థి వి.చైతన్యకృష్ణ జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఓబీసీ కేటగిరీలో ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన మెయిన్స్‌ పరీక్షలో 99.63 శాతం స్కోర్‌ సాధించిన చైతన్య కృష్ణ జేఈఈ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 694 ర్యాంకు కైవసం చేసుకున్నాడు.


శ్రీకాకుళానికి చెందిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ కుమారుడైన చైతన్యకృష్ణ నగరంలోని శ్రీచైతన్య ఐఐటీ అకాడమీలో ఇంటర్మీడియట్‌ (975 మార్కులు) చదువుకున్నాడు. ఈ నెల 27న జరగనున్న ఐఐటీ  అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న చైతన్యకృష్ణ...ఐఐటీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు చేయాలన్నదే తన లక్ష్యమని వెల్లడించాడు. చైతన్య కృష్ణకు శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజీఎం కేవీ రమణ అభినందించారు. 

Updated Date - 2020-09-19T09:26:15+05:30 IST