Abn logo
Sep 23 2021 @ 10:39AM

శృంగవరపుకోట ఎమ్మెల్యేకి దెబ్బ మీద దెబ్బ

విజయనగరం జిల్లా: శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యేకి సొంత పార్టీలో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎంపీపీ స్ధానాలు అనర్హులకు కట్టబెడుతున్నారని  నాలుగు మండలాల్లో కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. శృంగవరపుకోటలో తిరుగుబాటుదారుల నిరసన గురువారం నాటికి మూడో రోజుకి చేరింది. కొత్తవలసలో వైసీపీకి చెందిన 17 మంది ఎంపీటీసీల్లో 14 మంది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రహస్య శిబిరం నిర్వహిస్తున్నారు. పార్టీ సమన్వయకర్త చిన్న శ్రీను బుజ్జగించినా తిరుగుబాటుదారులు ససేమిరా అంటున్నారు.