Advertisement
Advertisement
Abn logo
Advertisement

మా జీతాలు ఇవ్వండి.. మాన్సాస్ ఉద్యోగుల ఆందోళన

విజయనగరం: మాన్సస్ సంస్థ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 15 నెలలుగా జీతాలు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ సారథ్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించారు. తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మాన్సాస్‌లో ఉండేటువంటి దేవాదాయ  శాఖకు సంబంధించిన కార్యనిర్వహణాధికారి సిబ్బందికి జీతాలు చెల్లించకూడదని బ్యాంకుకు లిఖిత పూర్వకమైన ఆదేశాలు జారీ చేయడంతోనే వివాదం చెలరేగింది. మాన్సాస్ ఛైర్మన్ జీతాలు చెల్లించమని, లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చెప్పినప్పటికీ ఇష్యూ కోర్టులో ఉన్నందున ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేయమని ఈవో లేఖ రాయడంతో ఆందోళనలు చెలరేగాయి. ఛైర్మన్ మాటకు గౌరవం ఇవ్వకుండా ఈవో వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మాన్సాస్ ఉద్యోగులు తీవ్రమైన ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు.  


Advertisement
Advertisement