భవిష్యత్తులో వ్యవసాయమే జీవనాధారం

ABN , First Publish Date - 2021-05-17T05:55:21+05:30 IST

రానున్న కాలంలో దేశంలోని యువతకు వ్యవసాయమే జీవనాధారం కానుందని ఉదయ్‌పూర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ టెక్నాలజీ వీసీ డాక్టర్‌ నరేంద్రసింగ్‌ రాథోడ్‌ తెలిపారు.

భవిష్యత్తులో వ్యవసాయమే జీవనాధారం
మాట్లాడుతున్న డాక్టర్‌ నరేంద్రసింగ్‌ రాథోడ్‌

విజ్ఞాన్‌ వెబినార్‌లో ఉదయ్‌పూర్‌ వర్సిటీ వీసీ  

గుంటూరు(విద్య), మే 16: రానున్న కాలంలో దేశంలోని యువతకు వ్యవసాయమే జీవనాధారం కానుందని ఉదయ్‌పూర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ టెక్నాలజీ వీసీ డాక్టర్‌ నరేంద్రసింగ్‌ రాథోడ్‌ తెలిపారు. వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో బీఎస్సీ(ఆనర్స్‌) కోర్సు ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో 55 శాతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సాంకేతికత అండతో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. మార్కెట్‌ను అంచనా వేస్తూ పంటల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.  విజ్ఞాన్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ కార్పొరేట్‌ కొలువుల్ని సైతం వదులుకుని ఎంతోమంది యువత నేడు వ్యవసాయ రంగం వైపు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, అధ్యాపకులు డాక్టర్‌ టీ రమేష్‌బాబు, డాక్టర్‌ వరప్రసాద్‌, డాక్టర్‌ బీ హరీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

   

Updated Date - 2021-05-17T05:55:21+05:30 IST