Jun 23 2021 @ 18:52PM

పండ్ల వ్యాపారిగా మారిన వీకే న‌రేశ్‌

న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న వీకే న‌రేశ్ పండ్ల వ్యాపారిగా మారారు. ఇంత‌కీ యాక్ట‌ర్‌గా బిజీగా ఉన్న న‌రేశ్ పండ్ల వ్యాపారిగా ఎందుకు మారాల్సి వ‌చ్చింది? అనే వివ‌రాల్లోకెళ్తే.. వ‌రుస సినిమాలతో బిజీగా ఉండే న‌రేశ్ కొవిడ్ స‌మ‌యంలో రైతుగా మారి పండ్ల తోట‌ల‌ను సాగు చేశారు. త‌న తోట‌లో పండిన మామిడి, నేరేడు పండ్ల‌ను త‌క్కువ ధ‌ర‌కే విక్ర‌యించారు న‌రేశ్ ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. సేంద్రీయ ప‌ద్ద‌తుల్లో పండిన ఈ పండ్ల‌లో మామిడి, నేరేడు పండ్ల‌ను రూ.50కు విక్ర‌యించి రూ.3600 సంపాదించాన‌ని.. న‌టుడిగా పొందే పారితోష‌కం కంటే ఈ చిన్న మొత్తం త‌న‌కెంతో సంతోషాన్నిచ్చింద‌ని న‌రేశ్ తెలిపారు.