కూలిన వకీల్‌పల్లె గని పైకప్పు

ABN , First Publish Date - 2020-10-30T11:09:29+05:30 IST

రామగుండం ఏరియా-2 పరిధిలోని వకీల్‌పల్లె గనిలో గురువారం మధ్యాహ్నం గనిపైకప్పు కూలిన ప్రమాదంలో ఓవర్‌ మన్‌ రాకం నవీన్‌ శిథిలాల కింద చిక్కుకున్నాడు.

కూలిన వకీల్‌పల్లె గని పైకప్పు

శిథిలాల కింద ఓవర్‌మన్‌ 

పలుమార్లు కూలిన పైకప్పు 

రెస్క్యూ సహాయక చర్యలకు ఆటంకం 

పర్యవేక్షిస్తున్న అధికారులు, కార్మిక సంఘాల నేతలు


యైటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 29 : రామగుండం ఏరియా-2 పరిధిలోని వకీల్‌పల్లె గనిలో గురువారం మధ్యాహ్నం గనిపైకప్పు కూలిన ప్రమాదంలో ఓవర్‌ మన్‌ రాకం నవీన్‌ శిథిలాల కింద చిక్కుకున్నాడు. మిడిల్‌ షిఫ్టులో మధ్యాహ్నం 3.20 ప్రాంతంలో 3వ సిమ్‌, 41 వడిప్‌, 66 లెవల్‌ జంక్షన్‌పై కప్పు 5నుంచి 10మీటర్ల మేర ఒక్కసారిగా కుప్పకూలింది. కుప్పకూ లిన సమయంలో అక్కడ ఎల్‌హెచ్‌డీ యంత్రంతో పాటు ఆపరేటర్‌ సతీష్‌, ఫిట్టర్‌ నర్సింహులు టేలన్‌ బాయ్‌ వంశీ, ఓవర్‌మెన్‌లు విధులు నిర్వహిస్తున్నా రు. పైకప్పు సరిగ్గా ఓవర్‌మెన్‌ నవీన్‌తోపాటు ఎల్‌ హెచ్‌డీ యంత్రంపై కూలడంతో శిథిలా కింద ఇరు క్కుపోయాడు. సతీష్‌, వంశీ, నర్సింహులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 


రెస్క్యూ సహాయక చర్యలు..

వీకేపీ గనిలో పైకప్పు కింద చిక్కుకున్న నవీన్‌ను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. 14 మంది గల రెండు బ్రిగేడియర్ల బృందం గనిలో శిథిలాల్లో చిక్కుకున్న ఓవర్‌మన్‌ను వెలికితీసే చర్యలు చేపట్టారు. పైకప్పు పలుమార్లు కూలుతుండ డంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. జీఎం సురేష్‌తో పాటు గని ఏజంట్‌, మేనేజర్లు గని లోకి దిగి శిథిలాల వెలికితీతను పర్య వేక్షిస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులు వైవీ రావు, యాదగిరి సత్తయ్య, ఐలి శ్రీనివాస్‌, శంకర్‌నాయక్‌, అన్నారావు, బొక్కల శ్రీనివాస్‌లు గనికి చేరుకుని పరిస్థితి ని తెలుసుకున్నారు. గనిలో రక్షణలోపం కారణంగా ప్రమాదం జరిగిందని, ఇందుకు యాజమాన్యం, టీబీజీకేఎస్‌లదే పూర్తి బాధ్యత అని ఏఐటీయూసీ, హెచ్‌ఎం ఎస్‌, బీఎంఎస్‌ నాయకులు వైవీ రావు, రియాజ్‌అహ్మద్‌, యాదగిరి సత్తయ్యలు వేర్వేరు ప్రక టనల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-10-30T11:09:29+05:30 IST