Advertisement
Advertisement
Abn logo
Advertisement

రష్యా అధ్యక్షుడు పుతిన్ తెల్లారి లేచింది మొదలు అర్ధరాత్రి వరకూ ఏం చేస్తారో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత నెలలో ప్రధాని మోదీని కలుసుకునేందుకు భారత్ వచ్చారు. వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయాల మాదిరిగానే అతని జీవితం కూడా ఆసక్తికరంగా సాగుతుంది. పుతిన్ రోజువారీ దినచర్య ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి ఆలస్యంగా నిద్రపోయే పుతిన్ రోజువారీ దినచర్య ఆలస్యంగా ప్రారంభమవుతుంది. పుతిన్ తన అల్పాహారంలో ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్ తీసుకుంటారు. ఈ గుడ్లు కిరిల్ ఫామ్‌ల్యాండ్ అనే ప్రత్యేక ఫామ్‌హౌస్ నుంచి వస్తాయి. ప్రోటీన్, మంచి కొవ్వు కోసం అల్పాహారంలో కాటేజ్ చీజ్ తీసుకుంటారు. తరువాత ఒక గ్లాసు జ్యూస్ తాగుతారు. అల్పాహారం పూర్తయిన తర్వాత పుతిన్ కాఫీ తాగేందుకు ఇష్టపడతారు. పుతిన్‌కు స్విమ్మింగ్ పూల్‌లో సమయం గడపడమంటే చాలా ఇష్టం, రోజుకు 2 గంటల పాటు ఈత కొడతారు. అనంతరం వ్యాయామం చేస్తారు. పుతిన్ ధరించే జిమ్‌ దుస్తుల ఖరీదు రూ. 2.5 లక్షలు. పుతిన్.. జిమ్‌లో కార్డియో, వెయిట్‌లిఫ్టింగ్ చేయడానికే ఇష్టపడతాడు. 

పుతిన్ వర్కవుట్ రొటీన్ ప్రభావం అతని శరీరం తీరులో కనిపిస్తుంది. రష్యా మీడియా తెలిపిన వివరాల ప్రకారం పుతిన్ ఉదయం వ్యాయామం చేసిన తర్వాత సమావేశాలపై దృష్టిసారిస్తారు. మీటింగ్‌లలో పాల్గొనేటప్పుడు ప్రత్యేక బ్రాండ్ దుస్తులు ధరిస్తారు. పుతిన్ దుస్తులను ఇటాలియన్ కంపెనీ కిట్టెన్  బ్రియోని అనే ప్రసిద్ధ సంస్థలు రూపొందిస్తాయి. సిబ్బంది అందించే సందేశాల ఆధారంగా పుతిన్ మీటింగ్‌లు కొనసాగుతాయి. ఈ సంక్షిప్త సందేశాలలో ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు కూడా ఉంటాయి. పుతిన్.. టెక్నాలజీకి దూరంగా ఉంటారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లను తక్కువగా ఉపయోగిస్తారు. రష్యా ప్రభుత్వ క్రెమ్లిన్ ప్రధాన కార్యాలయం పుతిన్ నివాసానికి 25 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. పుతిన్ సాయంత్రం వేళ తమ పెంపుడు జంతువులైన కోనీ, బఫీలతో గడుపుతారు.  అలాగే నల్ల సముద్రం ఒడ్డున నిర్మించిన నోవో-ఒగారియోవా ఎస్టేట్ కాంప్లెక్స్‌లో గడపడానికి ఇష్టపడతాడు. పుతిన్‌కు అర్థరాత్రి దాటాక నిద్రపోవడం, పుస్తకాలు చదవడం అలవాటు. ముఖ్యంగా డిన్నర్ తర్వాత పిస్తా ఫ్లేవర్డ్ ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. పుతిన్ సాధారణంగా మద్యం తాగడానికి ఇష్టపడడు, ప్రత్యేక కార్యక్రమాలలో మాత్రమే మద్యం తీసుకుంటారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement