ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-05T03:57:37+05:30 IST

ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు, అదనపు కమిషనర్‌ మంజీర్‌ సామున్‌ జిలాని శుక్రవారం పరిశీలించారు.

ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల పరిశీలన
నిర్మాణ పనులను పరిశీలిస్తున్న అధికారులు

ఎన్‌ఏడీ జంక్షన్‌, డిసెంబరు 4 : ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు, అదనపు కమిషనర్‌ మంజీర్‌ సామున్‌ జిలాని శుక్రవారం పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న పనుల గురించి విజయ్‌ నిర్మాణ్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు నెలాఖరులోగా అప్పర్‌ రోటరీ పనులు పూర్తి చేసి విశాఖ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్‌ ఇంజనీర్‌ రామ్మోహన్‌రావు, కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఉమాశంకర్‌, నిర్మాణ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T03:57:37+05:30 IST